విజయనగరం జిల్లా వేపాడ మండలం గొడుగులవీటిలో.. కిమిడి జోగులమ్మ (70) అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో.. ఈ దారుణం చోటుచేసుకుంది. చలికాలంలో వెచ్చదనం కోసం మంచం కింద పెట్టిన కుంపటే ఘటనకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా వీలు కాలేదు.
చలి కుంపటి మంటలు అంటుకుని.. వృద్ధురాలు సజీవదహనం - వేపాడలో అగ్ని ప్రమాదం
చలి కుంపటి మంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం
08:34 January 28
.
స్థానిక తహసీల్దార్ కార్యాలయం పక్కన జోగులమ్మ పాక వేసుకుని నివసిస్తోంది. మంచం కింద పెట్టిన కుంపటి నుంచి మంటలు చెలరేగాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమె కుమారుడు వేరే ఇంట్లో ఉంటుండగా.. అనారోగ్యంతో మంచం మీదున్న వృద్ధురాలు సజీవ దహనమవడం అందరినీ కలచివేసింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Jan 28, 2021, 6:41 PM IST