ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరేళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం - ఆరేళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

చాక్లెట్ ఆశచూపి ఆరేళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పిడిన అమానుష ఘటన విజయనగరం జిల్లా రంగరాయపురంలో చోటుచేసుకుంది. వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

By

Published : May 7, 2020, 9:10 PM IST

కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వృద్ధుడు చాక్లెట్ ఆశచూపి తన మనవరాలి వయస్సున్న ఓ చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన అమానవీయ ఘటన విజయనగరం జిల్లా రంగరాయపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ఢుడు సత్యం... ఆరుబయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికకు చాక్లెట్ కొనిస్తానని తన పూరి గుడిసెలోకి తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా..గమనించిన ఓ బాలుడు విషయాన్ని బాలిక తల్లికి తెలిపాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్ధుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details