ఆ దంపతులు జీవన స్రవంతిలోనే కాదు.మరణంలోనూ కలిసే ప్రయాణించారు.విజయనగరం జిల్లా పెనుబర్తి గ్రామంలో నివాసముంటున్న ముళ్ళు నరసింహులు నిన్న మధ్యాహ్నం3గంటలకు మృతి చెందాడు.భర్త ఎడబాటును తట్టుకోలేక భర్త మృతదేహం వద్ద విలపిస్తూ భార్య గురమ్మ కూడా అనంతలోకాలకు వెళ్లిపోయింది.వృద్ధ దంపతులిద్దరు ఒకేసారి మరణించటం గ్రామంలో విషాదాన్ని నింపింది.ఇంతవరకు గ్రామంలో ఇలాంటి ఘటన జరగలేదని గ్రామస్థులు వాపోయారు.
మరణంలోనూ వీడని బంధం - old couple died on same day at penubarthi village
పెళ్లంటే ఏడేడు జన్మల అనుబంధం అని రుజువు చేశారు ఆ దంపతులు. ఇది యాదృచ్ఛికమో లేదా దైవ సంకల్పమో తెలియదు కానీ,పెళ్లితో ముడి పడిన ఆ బంధం మరణంలోనూ తోడును వీడలేదు. విజయనగరం జిల్లా పెనుబర్తి గ్రామంలో వృద్ధ దంపతులిద్దరు ఒకేసారి మరణించటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
![మరణంలోనూ వీడని బంధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4707181-84-4707181-1570697398230.jpg)
విజయనగరం జిల్లాలో ఒకేసారి తనువు చాలించిన వృద్ధ దంపతులు
విజయనగరం జిల్లాలో ఒకేసారి తనువు చాలించిన వృద్ధ దంపతులు