విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని నేరెళ్ల వలస గ్రామంలో ఒడిశా ప్రభుత్వం నిర్మిస్తున్న జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాస రావుతోపాటు గ్రామీణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అక్కడ పనులను నిలువరించారు. అంతకుముందు అక్కడకు వచ్చిన శబరి క్షేత్ర కార్యదర్శి, ఆ రాష్ట్ర జిల్లా విశ్రాంత కలెక్టర్‌తో అధికారులు మాట్లాడారు. కరోనా సమయంలో గిరిజనులు పడుతున్న కష్టాలకు ఉపశమనం కలిగించే విధంగా వారు విశ్వసించి జగన్నాథ స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
అనంతరం ఆ గ్రామానికి చెందిన బచుల ప్రసాద్ అనే వ్యక్తి లిఖితపూర్వకంగా తహసీల్దార్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. మా ఇంటి ముందు ఆలయ నిర్మాణం చేపడుతున్నారని... తాను వద్దన్నా వినిపించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగుచర్యలు తీసుకుంటామని సాలూరు తహసీల్దార్ అన్నారు.