విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందర పేట గ్రామానికి ఆనుకుని ఉన్న డెంకాడ కాలువ ఆయకట్టు... నాణ్యత లోపంతో రైతులు పడ్డ ఇబ్బందులపై ఈనాడు, ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఆయకట్టు నిర్మాణాన్ని ఇరిగేషన్ డీఈ గోవిందరావు, ఏఈ కనకమహాలక్ష్మి కాలువను పరిశీలించారు. రహదారి విస్తరణ పనులు చేపట్టినప్పుడు...ఆయకట్టు నిర్మాణాన్ని పూర్తిగా లోతట్టుగా కట్టడంతో పాటు గట్టు నిర్మాణాల్లో లోపాలు ఉండడాన్ని గమనించారు. సర్వే చేపట్టి రెండు, మూడు రోజుల్లో రైతుల ఇబ్బందులను తీర్చి... ఆయకట్టు కింద ఉన్న 56 ఎకరాలకు సాగునీరు వెళ్లే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈటీవీ-భారత్ కథనానికి స్పందన...సాగునీటి విడుదలకు చర్యలు - డెంకాడ కాలువ ఆయకట్టు
విజయనగరం జిల్లా సుందరపేటకు ఆనుకుని ఉన్న డెంకాడ కాలువ ఆయకట్టుకు సంబంధించి... రైతులు పడుతున్న బాధలను ఈనాడు, ఈటీవీ-భారత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన అధికారులు త్వరితగతిన సర్వే చేపట్టి... ఆయకట్టు దిగువున ఉన్న 56 ఎకరాలకు సాగునీరు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈటీవీ-భారత్ కథనానికి స్పందన...సాగునీటి విడుదలకు చర్యలు