ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

kotia villagers: ఆంధ్రా మద్దతుదారులకు ఒడిశా నోటీసులు

ఒడిశా-ఆంధ్రా సరిహద్దులోని కొఠియా గ్రామాల్లో నివసిస్తున్న రాష్ట్ర మద్దతు దారులకు కొరాపుట్ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ నోటీసులు జారీ చేసింది. వారు కొరియా గిరిజనులను ప్రలోభపెట్టి,ఆంధ్రాకు మద్దతు పలకాలని ఒత్తిడి తెస్తున్నారని అందులో పేర్కొంది.

kotia
kotia

By

Published : Nov 25, 2021, 9:49 AM IST

Updated : Nov 25, 2021, 10:15 AM IST

ఒడిశా-ఆంధ్రా సరిహద్దులోని కొఠియా గ్రామాలకు (kotia villagers) సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కొఠియా ప్రాంతంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన 15 మందికి కొరాపుట్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ 15 మంది కొఠియా గిరిజనులను ప్రలోభపెట్టి,ఆంధ్రాకు మద్దతు పలకాలని ఒత్తిడి తెస్తున్నారని అందులో పేర్కొంది. నవంబరు 22న ఉదయం 11 గంటలకు ఎగ్జిక్యూటివ్‌ మెజ్యిస్టేట్‌ ఎదుటహాజరు కావాలని తెలియజేయగా, వీరు హాజరు కాలేదని సమాచారం.

Last Updated : Nov 25, 2021, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details