తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతిని విజయనగరంజిల్లా వ్యాప్తంగా అత్యంత వేడుకగా నిర్వహించారు. జిల్లాలోని గ్రామ గ్రామాన తెదేపా శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
విజయనగరంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు - ntr jayanthi celebrations in vizainagaram dist
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతిని విజయనగరంజిల్లా వ్యాప్తంగా అత్యంత వేడుకగా నిర్వహించారు. గ్రామ గ్రామాన తెదేపా శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
విజయనగరంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
విజయనగరంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి రాజు పార్టీ శ్రేణులతో కలసి, కోట వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెదేపా ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆశయాలు, లక్ష్యాలను భావితరాలు ముందుకు తీసుకువెళ్లాలని అశోక్ తెలిపారు.
ఇదీ చదవండి:చీపురుపల్లి క్వారంటైన్ నుంచి 106 మంది ఇంటికి