విజయనగరం జిల్లా సాలూరులో మద్యం దుకాణాల ముందు పరిస్థితి ఘోరంగా ఉంది. ఇన్ని రోజుల పాటు అనుసరించిన లాక్ డౌన్ నిబంధనలను పక్కన పెట్టి మద్యం కోసం జనాలు ఎగబడ్డారు.
మాస్కులు ధరించకుండా క్యూ లో నిలుచోకుండా జనాలను ఒకే దగ్గర ఉండడం చూసి పోలీసులు తరిమికొట్టారు. మందుబాబుల తీరుపై స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు.