ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధార్​ కేంద్రం వద్ద మహిళల క్యూ... కానరాని భౌతిక దూరం - జామి మండలం తాజావార్తలు

విజయనగరం జిల్లా జామి మండల పరిషత్​ కార్యాలయంలోని ఆధార్​ కేంద్రం వద్ద భారీగా మహిళలు క్యూ కట్టారు. వైఎస్సార్​ చేయూత పథకానికి.. చరవాణి నంబర్​తో ఆధార్​ అనుసంధానం కోసం వచ్చిన వారంతా భౌతిక దూరం పాటించకుండా నిలబడ్డారు.

aadhar center
ఆధార్​ కేంద్రం వద్ద నిలబడిన మహిళలు

By

Published : May 25, 2021, 3:05 PM IST

విజయనగరం జిల్లా జామి మండల పరిషత్​ కార్యాలయంలోని ఆధార్​ కేంద్రానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. వైఎస్సార్​ చేయూత పథకానికి.. ఆధార్ కార్డుకు చరవాణి నంబర్​​ అనుసంధానం తప్పనిసరి కావటంతో.. చాలామంది ఆధార్​ కేంద్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ ఆంక్షలు ఉండటంతో…ఆధార్​ కేంద్రం తెరవకముందే ఉదయం ఏడు గంటలకే మహిళలు వచ్చి క్యూ కట్టారు.

చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారంతా… భౌతిక దూరం పాటించకుండా నిలబడ్డారు. పోలీసులు అదుపు చేసినా.. పరిస్థితిలో మార్పు లేకపోవటంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆధార్ నమోదు కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

ఇదీ చదవండి:విజయనగరం జిల్లాలో బ్లాక్​ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details