ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Midday-meals: 'మా పంపకాలే కొలిక్కి రావట్లేదు..మీకెట్లా తిండి పెట్టేది..' - మధ్యాహ్న భోజనం

మధ్యాహ్న భోజన నిర్వాహకుల మధ్య వివాదం జరిగింది. దాంతో ఆ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టలేదు.

మధ్యాహ్న భోజనం
మధ్యాహ్న భోజనం

By

Published : Oct 4, 2021, 4:09 PM IST

బిల్లుల పంపకాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల మధ్య తలెత్తిన గొడవ తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఈరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టలేదు. ఈ సంఘటన విజయనగరం జిల్లా కస్పా ఉన్నత పాఠశాలలో జరిగింది.

మంజూరైన బిల్లుల డబ్బుల పంపకాల్లో నిర్వాహకుల మధ్య గొడవే దీనికి కారణమని.. అందుకే ఈ రోజు వంట చేయలేదని మధ్యాహ్నం భోజన నిర్వాహకులు చెబుతున్నారు. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్​ రావు, అధికారుల ఆదేశాలతో విద్యార్థులకు భోజనం సమకూర్చారు.

ఇదీ చదవండి:'సహాయం చేస్తే నిందలా..?'... గ్రామస్థుల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details