విజయనగంర జిల్లా మక్కువలో మాస్కులు ధరించటంపై ఆటోడ్రైవర్లకు పోలీసులు అవగాహన కల్పించారు. 'నో మాస్క్-నో సీట్' పేరిట సీఐ సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్కులు ధరించకుండా వస్తే ప్రయాణికులను ఆటో ఎక్కించుకోవద్దన్నారు. అంతే కాకుండా భౌతిక దూరం పాటించేలా.. ఆటోలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మక్కువలో 'నో మాస్క్ - నో సీట్' - మక్కువలో నో మాస్క్ నో సీట్ కార్యక్రమం
మాస్కు లేకుండా ఆటోలో ఎక్కించుకోవద్దని విజయనగరం జిల్లా మక్కువలో ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కల్పించారు. ఆటోలోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఐ..ఆటో డ్రైవర్లకు సూచించారు.

మాస్కులపై అవగాహన కార్యక్రమం