ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిథిలావస్థలో వసతి గృహం... చలికి వణుకుతున్న విద్యార్థులు - news of no fecilities in parvathi puram hostel

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బాలుర సంక్షేమ వసతిగృహం శిథిలావస్థకు చేరుకుంది. ఫలితంగా విద్యార్థులు చలికి వణుకుతున్నారు. భవనం మరమ్మతులకు రూ.10 లక్షలు మంజూరు చేసినప్పటికీ... నిధులు చాలవంటూ గుత్తేదారు ముందుకు రావడంలేదు.

శిథిలావస్థలో వసతి గృహం... చలితో వణుకుతున్న విద్యార్థులు

By

Published : Nov 23, 2019, 5:01 PM IST

శిథిలావస్థలో వసతి గృహం... చలికి వణుకుతున్న విద్యార్థులు

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బాలుర సంక్షేమ వసతిగృహంలో... విద్యార్థులు చలికి వణుకుతున్నారు. వసతిగృహం శిథిలావస్థకు చేరుకుంది. గదులకు, కిటికీలకు తలుపులు లేవు. చలికాలం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతూ నేలపై నిద్రిస్తున్నారు. భవనం మరమ్మతులకు రూ.10 లక్షలు మంజూరు చేసినప్పటికీ... పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నిధులు చాలవంటూ... గుత్తేదారు ముందుకు రావడంలేదు. ఈ కారణంగా విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు.

ABOUT THE AUTHOR

...view details