ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటిలో పడిన మనుమడిని రక్షిస్తూ తాత మృతి - Vizianagaram District Crime News

పశువులను మేతకు తీసుకెళ్లిన తాత, మనువడు చెరువు ఊబిలో చిక్కుకొని మృతిచెందారు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగింది.

పశువులను మేపుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మనువడితో పాటు తాత మృతి
పశువులను మేపుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మనువడితో పాటు తాత మృతి

By

Published : Nov 5, 2020, 1:03 PM IST

Updated : Nov 6, 2020, 9:52 AM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో పోలిపల్లిలో విషాదం జరిగింది. అమ్మమ్మ ఇంటికి దసరాకు వచ్చిన మనువడుతోపాటు తాతయ్య ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన దిలీప్ దసరాకు తాతయ్య ఇంటికి వచ్చాడు. పశువులను మేపేందుకు రైతు పైడయ్యతో దిలీప్​ గ్రామ సమీప చెరువు వద్దకు వెళ్లారు. అక్కడే మేస్తున్న పశువులు వరి పొలంలోకి పరుగులు తీశాయి. దీన్ని గమనించిన బాలుడు వాటిని తోలేందుకు చెరువు గడ్డ దాటుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. ఊబిలో కాళ్లు కూరుకుపోయాయి. భయంతో గట్టిగా కేకలు వేశాడు. అక్కడే ఉన్న తాత పైడయ్య...మనుమడిని రక్షించేందుకు వెళ్ళాడు.

తీవ్ర భయందోళనకు గురైన బాలుడు... పైడయ్య మెడను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. కాసేపటికి ఇద్ధరు నీటిలో విగతజీవులై తేలియాడారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

పత్రాలు ఉన్న వారిని పట్టుకోవడమేమిటి?

Last Updated : Nov 6, 2020, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details