విజయనగరం జిల్లా రామతీర్థానికి కొత్త విగ్రహాలు చేరుకున్నాయి. బొడికొండపై ధ్వంసమైన కోదండిరాముని విగ్రహాల స్థానంలో ప్రతిష్ఠించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విగ్రహాలను తయారుచేసింది. తిరుపతి నుంచి రామతీర్థం చేరుకున్న ఆ విగ్రహాలకు.. పొలిమేర నుంచి మంత్రోచ్ఛారణతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. వాటిని వాహనం నుంచి ప్రధాన ఆలయం ధ్వజస్తంభం వద్ద నిలిపారు. అక్కడ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
రామతీర్థం చేరుకున్న రాములోరు.. - రామతీర్థం వివాదం తాజా వార్తలు
విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాముల వారి విగ్రహం స్థానంలో ప్రతిష్టించేందుకు కొత్త విగ్రహాలు అక్కడికి చేరుకున్నాయి. తిరుపతి నుంచి రామతీర్థం వచ్చిన విగ్రహాలను పొలిమేర నుంచి మంత్రోచ్ఛారణతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

రామతీర్థం చేరుకున్న కొత్త విగ్రహాలు
శ్రీ రాముడుతోపాటు సీతాదేవి, లక్ష్మణ విగ్రహాలకు ఈ నెల 25 నుంచి 3 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ విగ్రహాలను 28న రామతీర్థం ప్రధాన ఆలయ కళ్యాణ మండపంలోని బాలాలయంలో ప్రతిష్ఠించనున్నారు.
రామతీర్థం చేరుకున్న రాములోరు..
ఇదీ చదవండి:తిరుపతి నుంచి రామతీర్థానికి సీత, రామలక్ష్మణుల విగ్రహాలు
Last Updated : Jan 23, 2021, 8:07 PM IST