సంచయిత, ఊర్మిళ గజపతిరాజు కుటుంబాల మధ్య మరో వివాదం తలెత్తింది. విజయనగరం కోట పైనుంచి ఊర్మిళ గజపతి రాజు... సిరిమాను ఉత్సవం వీక్షించటంపై సంచయిత గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు అనుమతించారంటూ మాన్సాస్ సిబ్బంది, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిమాను ఒకసారి తిరిగాక సుధ, ఊర్మిళ గజపతిరాజు వెనుదిరిగారు. అనంతరం ట్విటర్ వేదికగా సంచయితకు ఊర్మిళ గజపతిరాజు సమాధానం ఇచ్చారు. 20 ఏళ్లుగా సిరిమాను ఉత్సవాన్ని వీక్షిస్తున్నామని చెప్పారు. తనతోపాటు తన తల్లికి సంబరంలో పాల్గొనే హక్కు ఉందని స్పష్టం చేశారు.
సంచైత, ఊర్మిళ గజపతిరాజు కుటుంబాల మధ్య కొత్త వివాదం! - మాన్సాస్ ట్రస్టు వార్తలు
సంచయిత, ఊర్మిళ గజపతిరాజు కుటుంబాల మధ్య మరో వివాదం తలెత్తింది. విజయనగరం కోటపై నుంచి సిరిమాను ఉత్సవాన్ని వీక్షించటంపై సంచైత గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ట్విటర్ వేదికగా స్పందించిన ఊర్మిళ గజపతిరాజు.... తనతో పాటు తన తల్లికి సంబరంలో పాల్గొనే హక్కు ఉందని స్పష్టం చేశారు.
![సంచైత, ఊర్మిళ గజపతిరాజు కుటుంబాల మధ్య కొత్త వివాదం! sanchaita and urmila gajapathi raju pusapat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9332855-111-9332855-1603808555173.jpg)
sanchaita and urmila gajapathi raju pusapat