ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చూసేందుకు అన్నిఉన్నా... వాడేందుకు పనికిరావు..! - కాంపౌండ్ వాల్ తో కళకళలాడుతుంది.. వినియోగానికి మాత్రం పనికి రాదు

విజయనగరం జిల్లా సాలూరు మండలం కొత్తూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. అవసరమైన మౌలిక వసతులు ఉన్నా... అవి అధ్వానంగా తయారయ్యాయి. చూసేందుకు అన్ని ఉన్నా... వాడేందుకు ఒక్కటి పనికిరాదు ఇక్కడ.!

new bhuilding but no use in vizianagaram district school
కొత్తూరు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల

By

Published : Dec 5, 2019, 8:43 PM IST

కాంపౌండ్ వాల్ తో కళకళలాడుతుంది.. వినియోగానికి మాత్రం పనికి రాదు

ఈ పాఠశాలలో పిల్లలకు కాంపౌండ్, చదువుకునేందుకు బిల్డింగ్, మంచినీటి కోసం బోరు ఉంది. కానీ ఏ ఒక్కటి ఉపయోగపడదు. బోర్ నుంచి కనెక్షన్ ఉంటుంది... నీరు మాత్రం రాదు. గోడకి కులాయి ఉంటుంది... దాని నుంచీ నీరురాదు. మిడ్ డే మీల్స్ వండడానికి కట్టిన వంటగది... చాలా బాగా కనిపిస్తుంది. లోపలికి వెళ్లి వంట చెయ్యాలంటే స్లాబ్​ ఎక్కడ పడిపోతుందోనన్న భయం వెంటాడుతోంది. బయట కర్రల పోయ్యిపై వంట చేస్తారు. మరుగుదొడ్లు కొత్తగా ఉంటాయి... వాడేందుకు వీలుండదు. ఇలా చూడటానికి అన్నీ బాగానే ఉన్నా... వాడటానికి మాత్రం పనికిరావని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు స్పందించి... మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details