ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లిమర్ల రామతీర్థంలో ఘనంగా పవిత్రోత్సవాలు - నెల్లిమర్ల రామతీర్థంపై వార్తలు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థంలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరాములవారికి పట్టు పవిత్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు.

Nellimarla Rama Tirtha is richly celebrated
నెల్లిమర్ల రామతీర్థంలో ఘనంగా పవిత్రోత్సవాలు

By

Published : Sep 15, 2020, 10:18 AM IST

విజయనగరం జిల్లాలో మరో భద్రాద్రిగా భక్తులు కొలిచే నెల్లిమర్ల రామతీర్థంలో శ్రీరాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు పవిత్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. ప్రాతఃకాల అర్చన, బాలభోగం తర్వాత ఆస్థాన మండపంలో శ్రీమద్రామాయణ సుందరకాండ పారాయణం చేశారు.

ఆలయంలో విశేష హోమాలు, సుందరకాండ హవనం నిర్వహించారు. స్వామివారికి వివిధ నదీ జలాలతో అభిషేకాలు చేసి అలంకరించారు. అనంతరం పట్టు పవిత్రాలను సన్నిధిలోకి తీసుకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details