ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లిమర్ల జూట్​మిల్లు తెరిపించాలని బొత్సకు వినతిపత్రం అందజేత - Nellimarla jute mill labor leaders handing over the petition to Botsa satyanarayana

నెల్లిమర్ల జూట్​మిల్లు కార్మిక నాయకులు.. మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. యాజమాన్యం అన్యాయంగా లాకౌట్​ ప్రకటించిందని.. మిల్లును తెరిపించాలని విజ్ఞప్తి చేశారు.

botsa satyanarayana
botsa satyanarayana

By

Published : Jun 8, 2021, 4:55 PM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల జూట్ మిల్లు లాకౌట్​​పై.. మిల్లు యాజ‌మ‌న్య ప్ర‌తినిధుల‌తో చర్చించి సమస్య ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నం చేయాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్​ను ఆదేశించారు. జూట్ మిల్లు స‌మ‌స్య ప‌రిష్కార విష‌య‌మై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు జూట్ మిల్లు కార్మిక సంఘం నాయ‌కులు విజయన‌గ‌రంలోని ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌సయ్య క్యాంపు కార్యాల‌యంలో విన‌తిప‌త్రం అంద‌జేశారు. మంత్రి బొత్స.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా.కిషోర్ కుమార్‌, కార్మిక‌శాఖ ఉప క‌మిష‌న‌ర్ స‌మ‌స్య వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్యేలు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, అల‌జంగి జోగారావుల‌, జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌ ఇత‌ర అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారం జ‌రిగేలా ప్ర‌య‌త్నం చేయాల‌ని మంత్రి సూచించారు.

యాజమాన్యం లాకౌట్​ ప్రకటించిందని..ఎంతో మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని జూట్ మిల్లు శ్రామిక సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి:'సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయ్'

ABOUT THE AUTHOR

...view details