కరోనా కారణంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల జూట్ మిల్ లాక్ అవుట్ ప్రకటిస్తూ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత నోటీసును పరిశ్రమ ప్రధాన ద్వారానికి అంటించారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ముడిసరుకు లభ్యత, ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం వంటి కారణాలతో లాక్ అవుట్ ప్రకటిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
కరోనా ఎఫెక్ట్... నెల్లిమర్ల జూట్ మిల్ లాక్ అవుట్ - corona effect on nellimara jute mill
విజయనగరం జిల్లా నెల్లిమర్ల జూట్ పరిశ్రమకు కరోనా సెగ తగిలింది. మిల్లు లాక్ అవుట్ ప్రకటిస్తూ యాజమాన్యం నోటీసు జారీ చేసింది. ఈ నిర్ణయంతో 1,800 మంది కార్మికులు జీవనోపాధి కోల్పోనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 కుటుంబాలపై లాక్ అవుట్ ప్రభావం పడనుంది.
కరోనా ఎఫెక్ట్... నెల్లిమర్ల జూట్ మిల్ లాక్ అవుట్
పరిశ్రమ లాక్ అవుట్‌తో 1,800మంది కార్మికులు జీవనోపాధి కోల్పోనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 కుటుంబాలపై ప్రభావం పడనుంది. ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు... ఉద్దేశపూర్వకంగానే లాక్ అవుట్ విధించినట్లు ఆరోపించారు. ఈ నిర్ణయంపై మిల్లు యాజమాన్యం పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
Last Updated : May 27, 2021, 6:23 PM IST