విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఎస్వీడీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆర్సీఎం బాలుర స్కూలు ఎన్సీసీ విద్యార్థులు కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ శివారులోని ఎస్వీడీ కళాశాల నుంచి బెల్గాంలోని రైతుబజార్ వరకు సుమారు నాలుగు కిలో మీటర్లు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. కొవిడ్ వద్దు, వ్యాక్సిన్ ముద్దు, మాస్కులు ధరించండి.. కరోనా నుంచి రక్షణ పొందండి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు.
కొవిడ్‌పై ఎన్సీసీ విద్యార్థుల అవగాహన ర్యాలీ - NCC Students Awareness Rally news
కొవిడ్‌పై విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎన్సీసీ విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. క్రమశిక్షణ, దేశభక్తి అంశాలతో పాటు సామాజిక చైతన్యానికి వీరు కృషి చేస్తున్నారు.
![కొవిడ్‌పై ఎన్సీసీ విద్యార్థుల అవగాహన ర్యాలీ NCC Students Awareness Rally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11055902-23-11055902-1616052146324.jpg)
విద్యార్థుల అవగాహన ర్యాలీ