ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డారు... విచారణ జరిపించండి' - jiyyammavalsa latest news

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస గ్రామ ఉపాధి పనుల ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఉపాధి పనుల అక్రమాలపై దర్యాప్తు చేయాలంటూ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు.

jiyyammavalasa villagers agitation
జియ్యమ్మవలస గ్రామస్థుల ఆందోళన

By

Published : Jun 1, 2020, 5:40 PM IST

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి పనుల ఫీల్డ్ అసిస్టెంట్ తోటపల్లి సుజాత మేట్​లతో కుమ్మక్కై... డబ్బులు ఇచ్చిన గ్రూపులకు ఎక్కువ కూలీ వేస్తున్నారని ఆరోపించారు. వలస కూలీలు, కంపెనీల్లో పనిచేసే వారు, విద్యార్థుల పేర్లతో సుమారు వెయ్యి మందికి.. పనికి రాకుండానే ఎన్నెమ్మార్​లు రాస్తున్నారనీ..., వారి పేరున గత కొన్ని సంవత్సరాలుగా బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details