ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Narsipuram road accident: ట్రాక్టర్‌ను ఢీకొట్టి కారు.. తాతా, మనువడు దుర్మరణం - A car collided with a tractor parked in Vizianagaram district

Narsipuram road accident: ఆగి ఉన్న ట్రాక్టర్​ను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విజయనగం జిల్లా నర్సీపురం సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తాతా, మనువడు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

narsipuram road accident
narsipuram road accident

By

Published : Jan 4, 2022, 6:43 AM IST

Car collided with a tractor at Narsipuram: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్​ను​ కారు ఢీకొట్టడంతో తాతా, మనువడు అక్కడికక్కడే కన్నుమూశారు. గరుగుబిల్లి మండలం కొంక డివరం గ్రామానికి చెందిన చిన్నాం నాయుడు.. కారులో విశాఖ నుంచి స్వస్థలానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నర్సీపురం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్​ను వీళ్ల కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో చిన్నాంనాయుడు, ఆయన మనువడు అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై. సింహాచలం చెప్పారు.

కుటుంబంలో తీరని విషాదం

మృతుడు చిన్నాం నాయుడు.. భార్య మూడు రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతన్ని విశాఖలో ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తాతా, మనువడు మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదీ చదవండి..

భార్యను దూరం చేసిందని.. అక్కపై పెట్రోలు పోసి..

ABOUT THE AUTHOR

...view details