"దిశ చట్టం అంటూ వైఎస్ జగన్ బిగ్గరగా అరవడం.. వైకాపా బ్యాండ్ బ్యాచ్ అరుపులు, కేకలు వేయటం తప్ప.. ఆ చట్టంతో ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరగలేదు" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్రంలో ఉన్న మహిళలకేం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. సొంత నియోజక వర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే ఈ రోజు వరకు నిందితులను పట్టుకోకపోవటం ముఖ్యమంత్రి చేతగాని తనానికి నిదర్శనమని అన్నారు.
"స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే.. గుంటూరులో దళిత యువతి రమ్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ మృగాడు" అని నారా లోకేశ్ అన్నారు. హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'ఉపాధ్యాయులను అగౌరవపర్చడం నిత్యకృత్యం అయ్యింది'