ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nara Lokesh Birthday: రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు - nara Lokesh birthday

Nara Lokesh Birthday: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదినాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలు జిల్లాల్లో కేట్ కట్ చేసిన కార్యకర్తలు.. లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ అభిమానులు రూపొందించిన రథసారధి అనే వీడియా సాంగ్​ను గుంటూరులో విడుదల చేశారు.

nara Lokesh birthday
nara Lokesh birthday

By

Published : Jan 23, 2022, 3:54 PM IST

Updated : Jan 23, 2022, 6:35 PM IST

nara Lokesh birthday celebrations : రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

గుంటూరు జిల్లాలో..

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్రాడిపేటలోని నిర్మల్ హృదయ్ భవన్ లో వృద్దులకు అన్నదానం చేశారు. లోకేష్ అభిమానులు రూపొందించిన రథసారధి అనే వీడియా సాంగ్ ను విడుదల చేశారు. అనంతరం పార్టీ కార్యాలయ సిబ్బందికి బట్టలు, పండ్లు, స్వీట్స్ పంచిపెట్టారు. లోకేష్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మంగళగిరిలో నేతలు మృత్యుంజయ హోమం నిర్వహించారు.

ప్రకాశం జిల్లాలో

ప్రకాశం జిల్లా కందుకూరు, కనిగిరి నియోజక వర్గల వ్యాప్తంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తెదేపా నేత ఇంటూరి నాగేశ్వరరావు.. పేదలకు పది తోపుడు బండ్లను అందిచారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున్న పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అభిమానులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

కృష్ణా జిల్లాలో

కృష్ణా జిల్లా చల్లపల్లిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాణాసంచా కాల్చి అభిమాన నాయకుడి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఘనంగా లోకేశ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున్న కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా కదిరి కార్యాలయంలో పార్టీ శ్రేణులు కేకు కోసి పంచుకున్నారు. హిందూపురం పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలోని ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం ప్రాంగణంలో తెలుగుదేశం శ్రేణులు లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. గుత్తిలో నారా లోకేష్ చిత్ర పటానికి నేతలు పాలాభిషేకం చేశారు.

కడప జిల్లాలో

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు కడప జిల్లా రాయచోటిలో తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో

శ్రీకాకుళం జిల్లా పలాస లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

విజయనగరం జిల్లాలో

విజయనగరం జిల్లా పార్వతీపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని విజయనగరం డెఫ్ అండ్ డమ్ పాఠశాలలోని నలుగురు విద్యార్థులను ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకుంటున్నట్లు తెదేపా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు తెలిపారు.

ఇదీ చదవండి

Achenna celebrated Lokesh birthday : లోకేశ్ తెదేపా భవిష్యత్ నాయకుడు -అచ్చెన్నాయుడు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 23, 2022, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details