Nara Bhuvaneswari on Vizianagaram Train Accident: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందడంపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
TDP Leader Atchannaidu on Train Accident: విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటన బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను బృందం సభ్యులు పరామర్శించి అండగా నిలుస్తారని తెలిపారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయన్నారు.
CPM leaders visited Vizianagaram Government Hospital: విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీపీఎం నేతలు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఎం కోరింది. బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఎం నేత రాఘవులు కోరారు.
Vizianagaram Train Accident: పట్టాలపై బీభత్సం.. కొనసాగుతున్న సహాయ చర్యలు.. ప్రమాదం జరిగిన తీరు ఇలా..
Andhra Pradesh Leaders About Train Accident: కాగా రైలు ప్రమాదంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై అశ్వినీ వైష్ణవ్ సీఎం జగన్‌ను ఆరా తీశారు.