Nara Bhuvaneshwari Restarted Nijam Gelavali Yatra in Vijayanagaram: చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో మనస్థాపంతో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర ఈరోజు పునః ప్రారంభించారు. విజయనగరంలో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన అప్పారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య , కుమారుడితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ. 3లక్షల ఆర్థికసాయం అందించి, టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
అనంతరం విజయనగరం నుంచి తెర్లాం వెళ్లారు. పెరుమాళి గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని, మృతుడు మైలపిల్లి పైడియ్య కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ఆ తర్వాత తెర్లాం మండలం చీకటిపేటకు చెందిన టీడీపీ అభిమాని, మృతుడు గుల్లిపల్లి అప్పారావు కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరార్శించారు. తెర్లాం మండలం చీకటిపేట పర్యటన ముగించుకుని భువనేశ్వరి రాజాంలోని జి. ఎం. ఆర్ అతిధి గృహానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
జగన్.. నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పు: 'నిజం గెలవాలి' యాత్రలో భువనేశ్వరి
Uttarandra Districts Nijam Gelavali Yatra: ఈవారం భువనేశ్వరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు. ఈరోజు విజయనగరం జిల్లాలో బాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. రేపు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో, 5వ తేదీన విశాఖ జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు.