ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు - bobbili municipal election counting latest news

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక ఎన్నికల లెక్కింపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కౌంటింగ్ సిబ్బందికి అధికారులు శిక్షణ తరగతులు నిర్వహించారు.

counting arrangements
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

By

Published : Mar 13, 2021, 12:25 PM IST

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక ఎన్నికల కౌంటింగ్​కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పురపాలక ప్రత్యేకాధికారి సంయుక్త కలెక్టర్ వెంకట్రావు, పురపాలక కమిషనర్ ఎమ్​ఎమ్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి.. సూచనలు అందించారు.

బొబ్బిలి పురపాలక సంఘంలో 31 వార్డులు ఉండగా.. 11వ వార్డులు ఏకగ్రీవం కావటంతో, 30 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్​కు సంబంధించి 15 రౌండ్​లను ఏర్పాటు చేయగా... ఒక్కో రౌండ్​లో రెండు వార్డుల ఫలితాలు వచ్చేటట్లు ఏర్పాట్లు చేపట్టారు. పురపాలక కౌన్సిల్ హాల్​లోనే కౌంటింగ్ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్​ విధానాన్ని చూసేందుకు బారీ తెరలను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details