విజయనగరం పట్టణంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం, మూడు లాంతర్ల స్తంభాన్ని నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. మూడు ప్రధాన రహదారులు కలిసేచోట నిర్మించిన హరికేన్ లాంతర్ల స్తంభం. ఈ స్తంభంపై మూడు జాతీయ చిహ్నాలు కొలువై ఉంటాయి. ఈ స్తంభాన్ని విజయనగర రాజుల కాలంలో నిర్మించారని పూర్వీకులు చెప్పుకుంటారు. రాత్రి సమయంలో ప్రయాణికులకు దారి కనిపించేందుకు రాజుల కాలంలో మూడు లాంతర్ల స్తంభాన్ని నిర్మించారు. మూడు లాంతర్ల స్తంభం కారణంగా మూడు లాంతర్ల జంక్షన్‌గా ప్రసిద్ధి చెందింది. కూల్చివేసిన స్థానంలో అదే స్థలంలో మరో రూపాన్నిచ్చి మూడు లాంతర్ల కొత్త చిహ్నాన్ని నిర్మించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారని సమాచారం. ఇది ఇలా ఉండగా, విజయనగర రాజుల కాలం నాటి కట్టడాన్ని కూల్చివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగర రాజుల కాలం నాటి కట్టడం కూల్చివేత - విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం వార్తలు
విజయనగరం పట్టణంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం, మూడు లాంతర్ల స్తంభాన్ని నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. ఈ స్తంభంపై కొలువైన మూడు జాతీయ చిహ్నాలు ఉంటాయి. విజయనగర రాజుల కాలం నాటి కట్టడాన్ని కూల్చివేయడంపై స్థానికులు.. మండిపడుతున్నారు.
విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత