ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజ్జీ స్టేడియాన్ని పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి బొత్స - విజయనగరం తాజా వార్తలు

విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విజ్జీ స్టేడియాన్ని పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి బొత్స
విజ్జీ స్టేడియాన్ని పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి బొత్స

By

Published : Nov 15, 2020, 7:26 PM IST

విజయనగరంలోని విజ్జీ స్టేడియాన్ని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఈ మేరకు అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన ఆయన విజ్జీ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మూడు కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పనులు చేపట్టామన్నారు. ఇందులో 2.5 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా..రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు రావాల్సి ఉందన్నారు.

70 ఎకరాలలో వివిధ కాంపోనేంట్స్​తో స్టేడియం నిర్మాణం తలపెట్టామని, పనులు వేగవంతంగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు యాభై శాతం పనులే జరిగాయన్న మంత్రి..గతంలో ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు స్పోర్ట్స్ స్కూల్ పనులు పునరుద్దించాలని ఇందుకు ఉన్నతాధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్తగా 1,056 కరోనా కేసులు, 14 మరణాలు

ABOUT THE AUTHOR

...view details