ముగ్గుల పోటీతో ఓటు హక్కు అవగాహన పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. విజయనగరంలో స్వీప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని అయోధ్య క్రీడామైదానంలో చేపట్టిన ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు.ఓటరుచైతన్యాన్ని పెంపొందించే అంశాలకు సంబంధించిన నమూనాలను ముగ్గుల రూపంలో తీర్చిదిద్దారు. అదేవిధంగా.. ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన సీ - విజిల్ నమూనాతో పాటు.ఓటు హక్కును వినియోగించుకుందాం..సరైన నాయకుడిని ఎన్నుకుందాం వంటి నినాదాలనూరంగోళి ద్వారా తెలియజేశారు.వాటిల్లో ముగ్గురిని ఎంపిక చేసి బహుమతులు అందచేశారు.
ఇది చదవండి