ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంచైత మరో నిర్ణయం.. ఎమ్మార్ స్టేడియానికి లాక్! - ఎమ్మార్ కాలేజీ గ్రౌండ్​కు వాకింగ్ వెళ్లొద్దని సంచైత నిర్ణయం తాజా వార్తలు

విజయనగరంలో అయోధ్య మైదానంగా పేరున్న ఎంఆర్​ కళాశాల స్టేడియానికి... బయటి వ్యక్తులు వాకింగ్‌కు రావద్దంటూ.. మాన్సాస్ ఛైర్‌పర్సన్‌ సంచైత గజపతిరాజు తీసుకున్న నిర్ణయంతో మరో వివాదం తలెత్తింది. ఈ నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంచైత మరో నిర్ణయం.. ఎమ్మార్ స్టేడియానికి లాక్!
సంచైత మరో నిర్ణయం.. ఎమ్మార్ స్టేడియానికి లాక్!

By

Published : Dec 15, 2020, 3:48 PM IST

సంచైత మరో నిర్ణయం.. ఎమ్మార్ స్టేడియానికి లాక్!

అయోధ్య మైదానానికి బయట వ్యక్తులు వాకింగ్​కు వెళ్లొద్దంటూ.. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజు తీసుకున్న నిర్ణయంతో మాన్సాస్​లో మరో వివాదం మెుదలైంది. విజయనగరం పట్టణంలో ఉన్న అయోధ్య మైదానాని(ఎమ్మార్ కాలేజీ స్టేడియం)కి ఈ రోజు ఉదయం తాళాలు వేయించారు. ఎమ్మార్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు తప్ప మిగిలిన వారు లోపలకు వెళ్లకూడదని సంచైత లేఖ విడుదల చేశారు. సంస్థ నిర్ణయం పట్ల ఎన్నో ఏళ్లుగా మైదానంలో వాకింగ్ చేస్తున్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details