పరిషత్ ఎన్నికల్లో కొన్నిచోట్ల గందరగోళ పరిస్థితులు తలెత్తడతంతో.. కొన్ని చోట్ల నేడు రీపోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికలు ప్రశాంతగానే జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో ఎంపీటీసీ అభ్యర్థి పేరు తప్పుగా నమోదు కావటంతో పోలింగ్ వాయిదా వేశారు. దీంతో ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఓటేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు.
అంటిపేటలో ప్రశాంతంగా రీపోలింగ్ - విజయనగరం జిల్లాలో పరిషత్ ఎన్నికల రీపోలింగ్
విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. గురువారం జరిగిన పోలింగ్లో ఎంపీటీసీ అభ్యర్థి పేరు తప్పుగా నమోదు కావటంతో పోలింగ్ వాయిదా పడింది. పత్రాలను కొత్తగా ముద్రించి ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
అంటిపేటలో ప్రశాంతంగా రీపోలింగ్