రామతీర్థం ఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. 150 ఆలయాలపై దాడులు జరిగితే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కొండపైన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వైకాపా పాలన ఇలాగే ఉంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని అన్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే వైకాపా పనిగా పెట్టుకుందని విమర్శించారు. పోలీసులు కూడా చట్టప్రకారం నడుచుకోవాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు హితవు పలికారు.
'ఆలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం ఏమి చేస్తున్నారు?' - రామతీర్థం ఘటన తాజా వార్తలు
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఆలాయాల్లో విగ్రహాలకూ రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
ram mohan naidu on rama theertham