విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ భార్య శ్రీదేవి జిల్లాలోని చీపురుపల్లి మేజరు పంచాయతీలో వార్డు స్థానానికి బరిలో దిగారు. ఇప్పటికే ఈ పంచాయతీకి ఆమె రెండు పర్యాయాలు సర్పంచిగా పనిచేశారు. ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో.. సర్పంచి పదవికి కాకుండా 7వ వార్డు సభ్యురాలిగా ఆదివారం నామినేషన్ వేశారు.
పల్లె పోరు: ఎంపీ భార్య.. వార్డు అభ్యర్థినిగా - ap local polls 2021
భర్త ఎంపీ.. ఆమె రెండు పర్యాయాలు సర్పంచ్. కానీ ప్రస్తుత పల్లె పోరులో రిజర్వేషన్ మారటంతో సర్పంచి బరిలో నిలిచే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా వార్డు సభ్యురాలిగా నామినేషన్ దాఖలు వేసింది.
ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021