ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన తల్లి - ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

ఏ కష్టం వచ్చిందో తెలియదు..ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలనూ తనతోపాటే తీసుకెళ్లాలనుకుంది. తన ఇద్దరు పిల్లలతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని నరపాం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

mother and two children suicide
మృతదేహాల వద్ద రోధిస్తున్న కుటుంబసభ్యులు

By

Published : Oct 16, 2020, 2:24 PM IST

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని నరపాం గ్రామానికి చెందిన గౌరీ అనే వివాహిత తన ఇద్దరు ఆడపిల్లలతో ఆత్మహత్యకు పాల్పడింది. ఊరికి సమీపంలో ఉన్న చెరువులో పడి ఈ అఘాయిత్యం చేసుకుంది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని ఆమె భర్త తెలిపారు.

గౌరీ భర్త శ్రీను లారీ డ్రైవర్​గా పని చేస్తున్నట్లు తెలిపాడు. సొంతూరు గజపతినగరం అనీ, అక్కడ నుంచి కొత్తవలస మండల తుమ్మికాపల్లి వలస వచ్చి నివాసం ఉంటున్నారని చెప్పారు. కొంతకాలంగా వారి మధ్య జరుగుతున్న గొడవల కారణంగా తమ ఇద్దరు పిల్లలు సంకీర్తన(7), హాసిని(6)లతో బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. అభం, శుభం తెలియని చిన్నారులు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

కొనసాగుతున్న వరద ప్రవాహం... నీటిలోనే లోతట్టు ప్రాంతాలు

ABOUT THE AUTHOR

...view details