ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తల్లీ కుమారులు.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన... విజయనగరం జిల్లాలో జరిగింది. భోగాపురం జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో... విశాఖ జిల్లా పెదగంట్యాడకు చెందిన ఇద్దరు మృతి చెందారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఉండే కుమార్తెను చూసేందుకు కుమారుడితో కలిసి బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మృతుడిని డాక్‌యార్డ్‌లో ఉద్యోగిగా గుర్తించారు. అతివేగమే ఈ దుర్ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.