రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్‌ను విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి పంపిణీ చేశారు. అనంతరం మొబైల్ రైతు బజార్‌ను ప్రారంభించిన ఆయన లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని స్థానిక నాయకులు గురుమూర్తి, రవిచంద్రలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. రేషన్ కార్డు లేని నిరుపేదల కుటుంబాలకు 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ ఎస్.ఎస్ వర్మ, సహాయ కమిషనర్ ప్రసాదరావు, స్థానిక వైకాపా నాయకులు గురుమూర్తి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో మొబైల్ రైతు బజార్ - శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి తాజా వార్తలు
విజయనగరంలో మొబైల్ రైతు బజార్‌ను స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం రేషన్ కార్డులు లేని కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు.
![విజయనగరంలో మొబైల్ రైతు బజార్ mla kolagatla veerabhadra swamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6656073-939-6656073-1585998089898.jpg)
మొబైల్ రైతు బజార్‌ను ప్రారంభించిన శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి
మొబైల్ రైతు బజార్‌ను ప్రారంభించిన శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి
ఇవీ చూడండి...