ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై తెదేపా ఎమ్మెల్సీ హర్షం - సాలూరులో గిరిజన యూనివర్సిటీ

గిరిజన యూనివర్సిటీని విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గానికి ఇవ్వడంపై తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి సంతోషం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులపై సినీనటులు స్పందించాక ప్రభుత్వం రోడ్లు వేయిస్తాననడం దురదృష్టకరమన్నారు.

mlc sandyarani
mlc sandyarani

By

Published : Sep 1, 2020, 7:28 PM IST

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. అంతేకాకుండా సాలూరు నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఇవ్వడం సమంజసమన్నారు. అంతేకాకుండా గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఇంటింటికి రెండు వేల రూపాయలు చందా వేసుకొని రహదారి వేసుకోవడం దౌర్భాగ్యమని అన్నారు. బాలీవుడ్ సినీ నటుడు సోనూ సూద్ స్పందించి చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చిన తరువాత.. ప్రభుత్వం స్పందించి గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు.

తెదేపా హయాంలో చంద్రన్న బీమా ఉండడం వల్ల ఇంట్లో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు, సాధారణంగా చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబానికి చేయూతగా నిలిచేదని.. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని తీసివేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఇకపై రైతుల ఖాతాల్లోకే విద్యుత్ ఉచిత రాయితీ

ABOUT THE AUTHOR

...view details