'మద్యం దుకాణాలను వెంటనే మూసేయాలి' - 'మద్యం దుకాణాలను వెంటనే మూసేయాలి'
తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మహిళలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మద్యం దుకాణాలను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మహిళలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. లాక్ డౌన్ కాలంలో మద్యం అమ్మకాలు చేపట్టి కరోనా వ్యాప్తికి జగన్ కారణమయ్యారని ఆమె ఆరోపించారు. పనుల్లేక పేదప్రజలు ఇబ్బందులు పడుతుంటే మద్యం రేట్లు పెంచి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని మద్యం దుకాణాల వద్ద కాపలాగా ఉంచటం దారుణమని ఆక్షేపించారు. వెంటనే మద్యం దుకాణాలను మూసేయాలని ఆమె డిమాండ్ చేశారు.