కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న దశలో పరీక్షలు నిర్వహించటం అనాలోచిత చర్య అని, ప్రభుత్వ వైఖరిని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ అన్నారు. విజయనగరంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. పది, ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వ తీరుని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పంతానికి పోకుండా ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పది, ఇంటర్ పరీక్షలను.. కరోనా తగ్గే వరకు వాయిదా వేయాలని, లేదా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు దిగక తప్పదని ఆయన హెచ్చరించారు.
పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ - విజయనగరం ముఖ్యంశాలు
పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ వైఖరిని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ తప్పుపట్టారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ