ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీక్షాపరుల అరెస్ట్​ను​ నిరసిస్తూ ఎమ్మెల్సీ మాధవ్ ఆందోళన - రామతీర్థంలో నిరాహారదీక్ష చేస్తున్న భాజపా కార్యకర్తల అరెస్ట్​పై ఎమ్మెల్సీ మాధవ్ నిరసన

విగ్రహాలపై దాడులు చేస్తున్న దుండగులను పట్టుకోకుండా.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న భాజపా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ ఆందోళ నిర్వహించారు. గుర్ల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి.. తమ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

mlc madhav protest
గుర్ల పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ మాధవ్ నిరసన

By

Published : Jan 3, 2021, 8:25 PM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో భాజపా నేతల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం నాలుగు గంటలకు వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. ఇందుకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్.. గుర్ల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంపై మాధవ్ మండిపడ్డారు. రాముని విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తమ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పోలీసులు వైకాపా ప్రభుత్వ తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details