సాలూరు మండలం తోణం గ్రామంలో రూ.1.82 కోట్ల నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే రాజన్న దొర శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల్లోని నివసించే వారికి ఎటువంటి లోటు లేకుండా చూడటమే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని ఆయన అన్నారు. అంతే కాకుండా.. నియోజకవర్గం అన్నిచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉండేటట్లుగా నిర్మిస్తామని ప్రజలకు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - mla rajanna dora latest news
తోణం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే రాజన్న దొర శంకుస్థాపన చేశారు. గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలతో పీహెచ్సీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
పీహెచ్సీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజన్న దొర