విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రజలకు కరెంట్ కష్టాలు మెుదలయ్యాయి. పట్టణంలో వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొర నూతన ఇంటికి వచ్చిన విద్యుత్ సిబ్బంది...ఏప్రిల్ నెలకు సంబంధించిన బిల్లు అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే...తాను ఇంకా గృహప్రవేశం చేయలేదని.. ఇంట్లో విద్యుత్ వినియోగించకపోయినా వేల రూపాయల బిల్లు ఎలా వచ్చిందని విద్యుత్ సిబ్బందిని ప్రశ్నించారు.
'నాకే ఇలా జరిగితే..సామాన్యుల పరిస్థితేంటి?' - 'ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే..సామాన్యప్రజల పరిస్థితేంటి ?'
విద్యుత్ ఛార్జీల భారం సామాన్యులపైనే కాదు..ప్రజా ప్రతినిధులను సైతం వెంటాడుతోంది. సాలూరులో తన ఇంటికి భారీ ఎత్తున బిల్లు రావడంతో వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొర విద్యుత్‌శాఖ సిబ్బందిని నిలదీశారు.
'నాకే ఇలా జరిగితే..సామాన్యుల పరిస్థితేంటి?'
నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే నిలదీశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.