గిరిజన యూనివర్సిటీ గిరిజన గ్రామాల్లోనే ఉండాలని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీని మంజూరు చేసిన పీఎం, సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన బృందం బొబ్బిలి మున్సిపాలిటీ, సాలూరు మున్సిపాలిటీ మధ్యలో ప్రాంతాన్ని పరిశీలించారు. సాలూరు దగ్గర గిరిజన యూనివర్సిటీ కట్టినట్లయితే చదువు లేని గిరిజనులకు ఉపయోగపడుతుందని... గిరిజనులులేని దగ్గర యూనివర్సిటీ కట్టినా వారికి ఎటువంటి ఉపయోగం ఉండదని ఎమ్మెల్యే అన్నారు.
'గిరిజన యూనివర్సిటీ గ్రామాల్లోనే ఉండాలి' - గిరిజన యూనివర్సిటీ వార్తలు
గిరిజన యూనివర్సిటీ గిరిజన గ్రామాల్లోనే ఉండాలని విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రభుత్వాన్ని కోరారు.
వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర
సొంత డబ్బులతో రోడ్డు వేసుకోవడం పట్ల బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించాడు. అతనికి ధన్యవాదాలు తెలుపుతూ..అతను ఎప్పుడూ జిల్లాకు వచ్చిన స్వాగతిస్తామని ఆయన అన్నారు. పదిరోజుల్లో కొదమ పంచాయతీకి అధికారులతో వెళ్లి ప్రారంభిస్తానని తెలిపారు. ఇకమీదట అన్ని గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తానని.. ఎవరూ రోడ్డు లేక ఇబ్బంది పడకూడదని.. తోటి గిరిజనుడిగా వాళ్ల కష్టసుఖాలను పాలు పంచుకుంటానని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి.
'దేవాదాయ శాఖ నిధులను అమ్మఒడికి మళ్లిస్తున్నారు'
Last Updated : Aug 28, 2020, 6:41 PM IST