ఆదివాసుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే - విజయనగరం తాజా న్యూస్
విజయనగరం జిల్లా, సాలూరు మండలంలోని జగ్గు దొరవలసలో గిరిజన హక్కుల కోసం ఆదివాసులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర సందర్శించారు. దీక్షను విరమించి తమకు సహకరించాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు న్యాయ పోరాటాన్ని విరమింపజేసేది లేదని ఆదివాసీ నాయకులు తేల్చి చెప్పారు.

విజయనగరం జిల్లా, సాలూరు మండలంలోని జగ్గు దొరవలస గ్రామంలో గిరిజన హక్కుల కోసం ఆదివాసులు చేపట్టిన న్యాయ పోరాట దీక్ష.. నేటికి 45 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షను విరమించి సహకరించాలని గిరిజనులను కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు న్యాయ పోరాటాన్ని విరమింపజేసేది లేదని ఆదివాసీ నాయకులు తేల్చి చెప్పారు. మీతో పరిష్కారం కాకుంటే రాష్ట్ర గవర్నర్ వచ్చేంత వరకూ పోరాటం సాగుతుందని అన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే జయరాజు నిమ్మక, ఐటీడీఏ పీవో, గిరిజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.