MLA Kolagatla: మంత్రివర్గ పునర్వ్యవవస్థీకరణలో డిప్యూటీ సభాపతి పదవి దక్కటంపై విజయనగరం శాసన సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి హర్షం వ్యక్తం చేశారు. తనకు డిప్యూటీ స్పీకర్ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన డిప్యూటీ స్పీకర్ పదవీ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని తెలిపారు.
Kolagatla : "సీఎం జగన్కు కృతజ్ఞతలు.. నా విధులు బాధ్యతాయుతంగా నిర్వహిస్తా" - విజయనగరం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
MLA Kolagatla: డిప్యూటీ సభాపతి పదవి దక్కటంపై ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆనందం వ్యక్తం చేశారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన డిప్యూటీ స్పీకర్ పదవి విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని తెలిపారు.
ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరంజిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకల్లో కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘువర్మ తదతరులతో కలిసి.. పూలే విగ్రహనికి పూలమాల వేశారు. వైకాపాకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కోలగట్లకు అభినందనలు తెలియచేశారు.
ఇదీ చదవండి: Nadendla Manohar: 'మంత్రులపై సీఎంకు నమ్మకం లేదనడానికి రాజీనామాలు చేయించిన తీరే నిదర్శనం'