విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు కొవిడ్ బాధితులకు పండ్లు అందజేసి ధైర్యం చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి పీపీఈ కిట్ ధరించి... నేరుగా కరోనా రోగులను కలిశారు. ఆస్పత్రిలో వైద్య సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కరోనా రోగులకు పండ్లు అందజేసిన ఎమ్మెల్యే - కరోనా రోగులకు పండ్లు అందజేసిన ఎమ్మెల్యే న్యూస్
కొవిడ్ వార్డులోకి వెళ్లి.. కరోనా బాధితులను పలకరించి పండ్లు అందజేశారు ఎమ్మెల్యే అలజంగి జోగారావు. వారికి ధైర్యం చెప్పి.. పలు సూచనలు చేశారు.
కరోనా రోగులకు పండ్లు అందజేసిన ఎమ్మెల్యే