ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ - సాలూరు ఎమ్మెల్యే తాజా వార్తలు

సాలూరులో దివ్యాంగులకు ఉపకరణాలను స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర అందించారు.

saluru mla distributes instruments to divyanga
దివ్యాంగులకు ఉపకరణాలు పంచిపెట్టిన సాలూరు ఎమ్మెల్యే

By

Published : Sep 28, 2020, 10:09 PM IST

సాలూరు తహసీల్దార్​ కార్యాలయంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న 33 మంది దివ్యాంగులకు రూ. 2 లక్షల విలువ గల పరికరాలను అందజేశారు.

దివ్యాంగులపై జాలి చూపించాల్సిన అవసరం లేదని... వారికి కావాల్సిన ప్రేమను అందించాలని ఎమ్మెల్యే అన్నారు. కులమతాలకు అతీతంగా దివ్యాంగులకు రిజర్వేషన్​ కల్పించడం జరిగిందని... వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details