ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి' - bandukonda appalanaidu latest comments

విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఆర్ ముంగినాపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పరిశీలించారు. నాడు - నేడు పనులకు సంబంధించి భవన నిర్మాణ పనులపై ఆరా తీశారు.

mla bandukonda appalanaidu
ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

By

Published : Jun 29, 2020, 7:27 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఆర్ ముంగినాపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించిన ఆయన విద్యా ప్రమాణాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆయా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాడు - నేడు పనులకు సంబంధించి భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల విద్య కార్పొరేట్ స్థాయిలో ఉండటానికి ఉపాధ్యాయుల సహకారం ఎంతైనా అవసరమన్నారు.

ABOUT THE AUTHOR

...view details