దిశా చట్టం మహిళలు, బాలికలకు వరమని నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు పేర్కొన్నారు. భోగాపురం సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో 2 ప్రచార రథాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు. ప్రచార వాహనాలకు వరల్డ్ విజన్ ఇండియా సహకారం ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు.
మహిళల రక్షణ కోసమే దిశా చట్టం: అప్పలనాయుడు - నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తాజా వార్తలు
మహిళల రక్షణకు ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు వివరించారు. భోగాపురం సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో ప్రచార రథాలను ప్రారంభించిన ఆయన... బాల్య వివాహాలు, మహిళా చట్టాలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు.
దిశ ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు